జాతి రత్నాలు అనే సినిమా నవీన్ పోలిశెట్టి మరియు డైరెక్టర్ అనుదీప్ కె.వి ల కాంబినేషన్లో వచ్చిన సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి తెలుగు సినిమా చరిత్రలో మంచి విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర ఎలక్షన్ల వర్షం కురిపించింది,తరువాత నవీన్ పోలిశెట్టి స్వీటీ అలియాస్ అనుష్కతో కలిసి మిస్సెస్ శెట్టి అండ్ మిస్టర్ శెట్టి అనే సినిమా తీసి యావరేజ్ టాక్ తో ముగించింది.
ఇప్పుడు నవీన్ పోలిశెట్టి మరియు సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్యల కాంబినేషన్లో చిత్రీకరణ జరుగుతుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క ప్రోమో నో విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో హీరోయిన్ మీనాక్షి చౌదరి మరియు నవీన్ పొలిశెట్టి ఒక నగల వ్యాపార ప్రకటనల కనిపించడం జరిగింది.
ప్రొడ్యూసర్ నాగ వంశీ లక్కీ భాస్కర్, mad square,tillu square,daku maharaj లాంటి మంచి సినిమాలకు ప్రొడ్యూస్ చేసి మంచి లాభాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని నడిపిస్తున్నారు.
అనగనగా ఒక రాజు చిత్రంలో నవీన్ పోలిశెట్టి మరియు మీనాక్షి చౌదరిల కాంబినేషన్లో వస్తున్న సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న. డైరెక్టర్ శంకర్ హీరో మరియు హీరోయిన్ల కాంబినేషన్ లో కామెడీని పండించి ప్రేక్షకులను సంక్రాంతికి కడుపుబ్బ నవ్వించాలని డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఈవీల విడుదలైన ప్రోమోని పట్టి తెలుస్తుంది.
ఇక ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు లాంటి కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుకు నవ్వించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు, తన మ్యూజిక్ తో ఎన్నో మంచి మంచి పాటలను ప్రేక్షకులకు అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించడం ప్లస్ అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో ముందుగా శ్రీలీలను ఎంపిక చేయగా తన డేట్స్ దొరకక మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగింది.
ఇక ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా చిత్రీకరణ పూర్తి చేస్తుంది.. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి జాతి రత్నాలు లాంటి మంచి కామెడీ సినిమాని ప్రేక్షకులకు అందిస్తుంది అని డైరెక్టర్ తెలియజేయడం జరిగింది.

ముఖ్యపాత్రలు:
హీరో: నవీన్ పోలిశెట్టి
హీరోయిన్ :మీనాక్షి చౌదరి
డైరెక్టర్: కళ్యాణ్ శంకర్
మ్యూజిక్ డైరెక్టర్ :మిక్కీ జే మేయర్
ప్రొడ్యూసర్: నాగ వంశీ
సాయి సౌజన్య
