పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్నా OG(THEY CALL HIM AS OG) సినిమా పై తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశంలో ఉన్న సినీ ప్రేక్షకులందరికీ కూడా చాలా క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ నటించి ప్రేక్షకులకు ముందుకు వస్తున్నా చిత్రం OG.
పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు… డైరెక్టర్ సుజిత్ గతంలో శర్వానంద్ రన్ రాజా రన్ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది ఈ చిత్రంలో శర్వానంద్ మరియు డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో చిత్రం మంచి విజయం సాధించింది. తరువాత డైరెక్టర్ సుజిత్ ప్రభాస్ తో సాహో చిత్రం చేయడం జరిగింది. ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ నీ పెద్ద గ్యాంగ్ స్టార్ పాత్ర లో చూపించనున్నాడు.
చిత్రంలో ఇమ్రాన్ హష్మీ పాత్ర పై ప్రేక్షకులకు ఆతృతగా ఉంది. పవన్ కళ్యాణ్ మరియు ఇమ్రాన్ హష్మీ లా మధ్య ఏ విధంగా చిత్రం నడవ బోతున్నతుందో డైరెక్టర్ సుజిత్ వీరిద్దరిని ఎలా కథలో ఎలా నడిపించాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా లో ముఖ్యపాత్రులుగా ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి,ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
బడ్జెట్:
ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ DVV దానయ్య 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డివివి గారు గతంలో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ RRR తో తెలుగు మరియు భారతదేశ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు టీవీ దానయ్య మరియు పవన్ కళ్యాణ్ లా చిత్రం పై తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు:
>పవన్ కళ్యాణ్
>ఇమ్రాన్ హష్మీ
>ప్రియాంకా అరుళ్ మోహన్
>శ్రియా రెడ్డి
>ప్రకాష్ రాజ్
>హరీశ్ ఉత్తమన్
>అభిమన్యు సింగ్
>అజయ్ ఘోష్
>అర్జున్ దాస్
>శుభలేఖ సుధాకర్
>రావు రమేష్
>వెన్నెల కిషోర్
